Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంబడించి, వెంబడించి కరుస్తున్న కుక్కలు
- మాంసపు విక్రయ షాపుల వద్ద శిక్షణ పొందుతున్న కుక్కలు
- కుక్కల బారిన నుంచి కాపాడాలని ప్రజల వినతి
వీధి కుక్కల దాడులు రోజురోజుకూ పెరుగుతున్న వాటిని అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వీధి కుక్కల దాడిలో చాలా మంది ప్రజలే కాకుండా మూగజీవాలు సైతం ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఉన్నాయి. ద్విచక్ర వాహనాలపై, ఒంటరిగా నడిచే ప్రజలపైన, మూగజీ వాలపైన కుక్కలు దాడులు చేస్తున్నాయి. గ్రామ శివారులోకి వెళ్లాలన్న.. గ్రామ వీధుల్లో నడవాలన్నా ప్రజలు జంకుతున్నారు. కుక్కల బెడద నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
నవతెలంగాణ-శంషాబాద్
మార్చి 12న నర్కూడ గ్రామంలోని సర్దార్ మియా బాయి వద్ద నిమ్మల శేఖర్ అనే పాడి రైతుకు చెందిన మూ డు దుడ్డెలు, ఒక లేగ దూడను తెల్లవారుజామున వీధి కుక్క లు విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశాయి. దీంతో ఆ రైతు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇదే ఈ నెల 3న సాయంత్రం తన పశువులను కట్టేసి ఇంటికి ద్విచక్రవాహ నంపై వస్తున్నాడు. ఈ సమయంలో ఓ వీధి కుక్క అతనిపై దాడి చేసి చేతి వేళ్ళను కొరికింది. దీంతో చేతి వేళ్ళకు తీవ్ర గాయమైంది. దూడలపై దాడి చేసిన కుక్కలు తనపై కూడా దాడి చేయడంతోనే భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని అతనికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. గ్రామ పొలిమేరలో ఉన్న పశువుల కొట్టాల మీద కుక్కలు దాడి చేసి దూడలను, మేకలను చంపుతున్నాయి. దీంతో పాడి రైతులు భయంతో కాలం వెల్లదీస్తున్నారు. గ్రామంలో ఒక్కొక్క చోట 5, 6 వీధి కుక్క లు ఉండడంతో అక్కడి నుంచి నడవాలంటే ప్రజలు భయప డుతున్నారు. కుక్కల దాడిలో చాలామంది గాయపడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి.
ఆహారం, నీటి కొరత
ఒకప్పుడు కుక్కలకు గ్రామంలోని ప్రతి వీధిలో ఆహారం, తాగునీరు దొరికేవి. ఇప్పుడు చెత్త సేకరణ జరు గుతున్న క్రమంలో ఆహారం, వ్యర్థాలను నేరుగా గ్రామపం చాయతీ సిబ్బందికి అందించడంతో ఆహారం, నీళ్ళు అందక కుక్కలు వెర్రెత్తిపోతున్నాయి. దీంతో అవి ఆకలితో చిన్నపి ల్లలు, పెద్దలపై కూడా తమ ప్రతాపం చూపిస్తున్నాయి. నగరంలో వీధి కుక్కల దాడిలో చిన్నారి బాలుడు మరణించి న విషయంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. గ్రామాల్లో ఉన్న వీధి కుక్కలను జనవాసాలకు దూరంగా తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో స్పందించిన అధి కారులు గ్రామంలోని వీధి కుక్కలను ప్రత్యేక వాహనంలో ఊరి బయటకు తరలించారు. అయితే ఆ కుక్కలు వారం రోజులు కాకముందే తిరిగి మళ్లీ ఊరిలోకి వచ్చాయి.
మాంసం విక్రయ శాలల వద్ద కుక్కలకు శిక్షణ
కోళ్ల మాంసం, మేకలు, గొర్రెల మాంసం దుకాణాల వద్ద వీధి కుక్కలు సంచరిస్తున్నాయి. ప్రజలు తినడానికి పనికిరాని మాంసం ముక్కలను షాపుల యజమానులు అక్కడే ఉన్న కుక్కలకు వేస్తున్నారు. దీంతో ఆ కుక్కలు నేల మీద మాంసం ముక్క పడక ముందే నోటితో అందు కుంటున్నాయి. ఇలా జంపింగ్ చేస్తూ వేట కుక్కలుగా మా రుతున్నాయి. వాటికి ఆహారం దొరకనప్పుడు ఊరి బయ టకు వెళ్లి మూగజీవాలపై, అక్కడ సంచరించే ప్రజలపై దాడులు చేస్తున్నాయి. మాంసం దుకాణాల వద్ద కుక్కలకు మాసం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్ల క్ష్యం వహించడం వలన సమస్య ఏర్పడుతుందని గ్రామస్తు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాంసం సరదాలతో పాటు ఆహారం పదార్థాలను ఇష్టమున్న ప్రదేశంలో పడేస్తుండడం వలన ఆ ప్రదేశాల్లో కుక్కల సంచారం అధికంగా ఉన్నది. వీటి పైన అధికారులు నిఘా ఉంచాలని బాధితులు కోరుతున్నారు. కుక్కలు దాడులు చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రతి వీధి కుక్కకూ రేబిస్ వ్యాక్సిన్ ఇప్పించాలని ప్రజలు కోరుతున్నారు.