Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాజేంద్రనగర్
అర్ధరాత్రి ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో సల్ప ఆస్తి నష్టం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతాల్లోని ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ గోదాంలో అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు వచ్చాయి. క్షణాల్లో మంటలు కంపెనీ మొత్తం పూర్తిగా వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికు లు తీవ్ర భయాందోళనకు గురై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సుమారు రెండు గంటలు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షాక్ సర్క్యూట్ కారణంగానే ప్రమా దం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అధికారుల నిర్వహణ లోపం, పలుమార్లు హెచ్చరించినా గోదాం యజమానులు, కంపెనీ యజమా నులు వినకపోవడంతో కాటేదాన్ పారిశ్రామిక వాడలో పలు కంపెనీలలో ఫైర్ సేఫ్టీలు ఏర్పాటు చేసుకోకపోవడం వల్లే తరచుగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగి నప్పుడు అధికారులు కాస్త హడావిడి చేసి అనంతరం లైట్ తీసుకోవడంతో కాటేదాన్ పారిశ్రామిక వాడలో పరిపాటిగా మారింది. నిరంతరం వేసవికా లంలో ఏదో ఒక చోట అగ్నిప్రమాదం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు వీడి ఫైర్ సేఫ్టీ, అనుమతులు లేని గోదాం, కంపెనీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.