Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయవంతం చేయాలి
- సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పి.జంగయ్య గోడ పత్రిక ఆవిష్కరణ
నవతెలంగాణ-శంషాబాద్
ఈ నెల 14వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో మో డీ అటావో దేశ్ కి బచావో అంటూ చేపట్టబోయే 'ఇంటిం టికీ సీపీఐ' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పి. జంగయ్య అన్నారు. శుక్రవారం శంషాబాద్‌లో కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న కార్పొరేట్, మతోన్మాద విధానాలను ప్రతిఘటించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీని రానున్న ఎన్నికల్లో కేంద్రం నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలు పునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎ.రవీంద్రచా రి, పుస్తకాల నర్సింగ్‌రావు, పి.పర్వతాలు ఓరుగంటి యాదయ్య, ఎం.యాదిరెడ్డి, కె.నర్సింహ, కే.రామ స్వామి, బి.జంగయ్య ఎం.ప్రభులింగం, కిషోర్ రియాజ్, నీలమ్మ, వి.జైపాల్‌రెడ్డి, వి.సత్యనారాయణ, మండల కార్యదర్శి నర్రగిరి, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.
నేడు రాష్ట్ర కార్యదర్శి శంషాబాద్‌కు రాక
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శనివారం శంషాబాద్‌కు వస్తున్నారని శంషాబాద్ మండలం కార్యదర్శి నర్రగిరి తెలిపారు. నేషనల్ హైవే44 అంబేద్కర్ చౌరస్తాలో జరిగే సీపీఐ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు.