Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు జనాభా ప్రకారం టికెట్లు ఇవ్వాలి
- బుక్క వేణుగోపాల్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి
- జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి
నవతెలంగాణ-శంషాబాద్
ఓబీసీలకు రాజకీయ పదవులు ఇవ్వడంలో గతంలో పరిపాలన చేసిన కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ తీవ్ర వివక్ష చూపుతున్నాయని జాతీ య బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి అన్నారు. శుక్రవారం శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలో ఇంటికి ఓబీసీ కార్యక్రమం బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల ఆధ్వర్యంలో నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆచారి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధి కారంలోకి వచ్చేందుకు ఓబీసీలను సంఘటిత పరచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.
వేణుగోపాల్‌కు రాజేంద్రనగర్
ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి
ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన బుక్క వేణుగోపాల్ రాజేంద్రన గర్ నియోజకవర్గంలో రాజకీయ నాయకుడిగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న కారణంగా ఎమ్మెల్యే టికెట్ ఆయనకే ఇవ్వాలని పలువురు అన్నారు. ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా వారి కోసం నిలబడతారనీ అభిప్రాయపడ్డా రు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టికెట్ గోపాల్ ఇస్తే పార్టీలకతీతంగా బీసీలందరూ ఆయనను గెలిపించు కుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, కాలే భాస్కర్రాజ్, బొక్క నరసిం హారెడ్డి, దివాకర్, అంజయ్యగౌడ్, నందకిషోర్ వడ్డే చంద్ర య్య, చిటికెల వెంకటయ్య, బైతీ శ్రీధర్, చేవెళ్ల మహేందర్, సునిగంటి సిద్దులు, నానవాల కుమార్‌యాదవ్, తొంట అశోక్, ఉప సర్పంచ్ కలమ్మ, తదితరులు పాల్గొన్నారు.