Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
మాదాపూర్‌లో గల శిల్పారామం లోని ఎథ్నిచ్ హాల్లో సంగీతనాటక అకా డమీ అవార్దీ నాట్యాచార్యులు పండిట్ రాజేంద్ర గంగాని, ఆర్తిశాఖేర్ ఆధ్వర్యం లో కథక్ నృత్య వర్క్‌షాప్‌ని నిర్వహిస్తు న్నారు. మూడు రోజుల ఈ కథక్ నృత్య వర్కషాప్లో దాదా పుగా అరవై మంది కథక్ కళాకారులు పాల్గొని గురువర్యులు దగ్గర కథక్ నృత్యంలో మెళుకువలను నేర్చుకుంటున్నారు. నర్తకి నృత్య ప్రదర్శనలో పద నర్తనం, హస్త విన్యాసం, అభినయం తాళ లయ గతుల గురించి అవగాహ ఇస్తు న్నారు. ఈ తరం కళాకారులకి ప్రాచీన కళ ప్రాముఖ్యత తెలు సుకోవడం, నృత్యంలో మెళకువలు నేర్చుకోవడం లాంటివి ఈ వర్కషాప్లో నేర్చుకోవడం సంతోషంగా ఉందని కళాకారులు వ్యక్తం చేస్తున్నారు. శిల్పారామంలో మూడు రోజుల వసంతోత్సవ నృత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యా యి. ప్రముఖ కథక్ కళాకారిణి అర్చన మిషర్ మరియు ఒడిసి కళాకారిణి సస్మితా మిశ్ర బృందం జుగల్బందీ ప్రదర్శన రెండుగంటల పాటు ఆద్యతం అలరించింది. ప్రదర్శనలో భాగంగా గణేష్ వందన, పంచదేవ స్తుతి, సర్గం, బసంత పల్లవి, గురు వందన, రాధా కృష్ణ, రహ భైరవి, స్థాయీ, నృత్య సంగీత్, భారత్ అనోఖా రాజ్, జుగల్బందీ అంశాలను ప్రదర్శించి మెప్పించారు. ప్రదర్శించిన కళాకారులు శ్రేయ సుమన్, శుభశ్రీ, అనిష్క, ఇక్షిత, ఆకాంక్ష, తానిషా, కామాక్షి, జ్యోతిక, అక్షిత, అన్విత, నీసా, నిధిప తదితరులు ప్రదర్శించారు.