Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ నల్లగండ్లలో భూగర్బ డ్రయినేజీ సమస్యను శుక్రవారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి, నల్లగండ్ల వాసులతో కలిసి పరిశీలించారు. కొన్ని రోజులుగా భూగర్భ డ్రయినేజీ నీటి కాలువ వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతుందని, సరైన చర్యలు తీసుకోకపోవటం, శుభ్రం చేయకపోవటం వలన తరచూ అనారోగ్యపాలు కావాల్సి వస్తోందని కాలనీవాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కార్పొరేటర్ డ్రయినేజీని పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు, విష్ణువర్ధన్‌రెడ్డి, గిరి, నగేష్ స్థానిక నేతలు కార్యకర్తలు హెచ్ఎండబ్ల్యుఎస్ సూపెర్వైసోర్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.