Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బ చెన్నయ్య, రైతు సంఘం నాయకులు ఎస్ రమేష్
నవతెలంగాణ-తలకొండపల్లి
ఉపాధి హామీ కూలీలపై దాడికి పాల్పడిన పడకల్ సర్పంచ్ సేవిటి రమేష్, అతని కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బ చెన్నయ్య, రైతు సంఘం నాయకులు ఎస్ రమేశ్ డిమాండ్ చేశారు. గురువారం గ్రామానికి చెందిన కూలీ పుష్ప లతపై సర్పంచ్, అతని కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కేవీపీఎస్ నాయ కులు శుక్రవారం బాధితురాలిని పరామర్శించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ కూలీలను సర్పంచ్ పరుష పదజాలంతో దూషించాడని అన్నారు. పుష్పలతపై దాడికి పాల్పడి నట్టు తెలిపారు. బాధి తురాలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింద న్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పడకల్ గ్రామ కూలీలు శివగల్లా జంగమ్మ, అనసూయ, బండ గళ్ళ యాదమ్మ, శివగళ్ళ జంగమ్మ, చెవిటి మహేష్, శివగల మహేష్, శివగల నరేష్, శివ గళ్ళ మైసమ్మ, తదితరులు పాల్గొన్నారు.