Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
- మాడ్గులలో టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభ విజయవంతం
నవతెలంగాణ-మాడ్గుల
దేశ సంపదను ఆదానీ, అంబానీ, ఇతర వ్యాపార వేత్తలకు దోచిపెడుతూ దేశాన్ని లూటీ చేస్తున్న మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యాలయ సముదాయం నుంచి వాసవి ఫంక్షన్ హాల్ వరకూ బ్యాం డ్ మేళాలు, నత్యాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సమ్మే ళనంలో కొల్కులపల్లి, నర్సయిపల్లి, గుడితండా, కట్రోని తండా, నాగిళ్ళ, ఫిరోజ్ నగర్, అప్పరెడ్డిపల్లి, జయరామ్ తండా, పకిర తండా, దొడ్లపహాడ్, అవురు పల్లి, నల్లవారి పల్లి, సండ్రల గడ్డ తండా, నల్లచెరువు గ్రామాల పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. అనేక ఉచిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయకపోగా ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్లకు అమ్మేస్తూ, దేశ వనరులను, సంప దను లూటీ చేస్తుందని విమర్శించారు. కుల మతాలతో ప్రజలను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే అక్కసుతో విద్యార్థుల పరీక్ష పత్రాలను లీకు చేసి, నీచ రాజ కీయాలకు పాల్పడు తుందని దుయ్యబటారు. బీజేపీని ఓడ ిస్తేనే దేశానికి మనుగడ ఉంటుందనీ,ఈ విషయాన్ని ప్రజ లంతా ఆలోచించాలన్నారు. అదేవిధంగా ప్రజా సంక్షేమం అభి వృద్ధే ధ్యేయంగా అంకితభావంతో పరిపాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్కు మళ్లీ పట్టం కట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, బీఆర్ఎస్ రాష్ట్ర యకులు గోలి శ్రీని వాస్ రెడ్డి, బీిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏమిరెడ్డి జైపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ శంకర్ నాయక్, సర్పంచులు ఎంపీ టీసీలు పిఎసిఎస్ చైర్మన్ డైరెక్టర్లు, మార్కెట్ డైరెక్టర్లు,రైతు సమన్వయ సమితి అధ్య క్షులు,గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.