Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.యాదగిరి
నవతెలంగాణ-మంచాల
సబియా మహదత్ ప్రభుత్వ ఉపాధ్యాయులురాలి తొలగింపు ఉత్తర్వులు నిలిపివేయాలని బీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. యాదగిరి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హమ్మకొండ జిల్లా కమలాపూర్ ఉన్నత పాఠశాలలో హిందీ పరీక్ష పేపర్ బయటకు వచ్చిన ఘటనలో ఇన్విజిలెటర్ సభియా మహా దత్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ హన్మకొండ డీఈవో ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేసి, సమగ్ర విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఎలాంటి విచారణ చేయకుండా సర్వీసు నుంచి తొలగిస్తూ అదే రోజు డీఈవో ఉత్తర్వులు ఇచ్చారని అన్నారు. పేపర్ లీకేజీ పేరిట ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయడానీకో లేక సంచనం సృష్టించడానికో, లేదా రాజకీయ కుట్ర కోణంలో ఈ సంఘటన జరిగినట్టు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఎవరి పాత్ర ఏమిటో విచారణలో తెలుస్తుందన్నారు. తల్లితండ్రుల, విద్యార్థుల్లో, ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి ప్రయత్నించిన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే గది నుంచి పేపర్ బయటకు పోవడంలో ఇన్విజిలెటర్ పొరపాటు కావచ్చు కానీ ఉద్దేశ్య పూర్వకంగా నిందితులకు సహకరించినట్టు నిరూపణ కాలేదన్నారు. మొదటి పావు గంటలో ఓఎంఆర్ షీట్స్ చెక్ చేసి, సంతకాలు పెడుతున్న క్రమంలో ఊహించని రీతిలో మైనర్ బాలుడు చెట్టెక్కి మొదటి అంతస్తుకు వచ్చి కిటికీ చాటు నుంచి పేపర్ ఫొటోతీసిన విషయం గమనించలేదన్నారు. ఇలాంటి విషయాల పై సమగ్ర విచారణ జరుపకుండా, తీవ్రమైన దండన విధించే ముందు, కనీస సీసీఏ నిబంధనలు పాటించకుండా ఉపాధ్యాయురాలుని ఏకపక్షంగా ఉద్యోగం నుంచి తొలగించడం సమంజసం కాదన్నారు. హన్మండ డీఈవో ఉపాధ్యాయుల నమోధైర్యాన్ని దెబ్బతీసిందన్నారు. ఎస్ ఎస్సీ పరీక్షల విధులు నిర్వహించలంటే ఉపాధ్యాయులు భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి వాకటి కరుణ జోక్యం చేసుకుని, డీఈవో ఉత్తర్వులు నిలిపి, సమగ్ర విచారణ జరిపిన తరువాత చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డం యాదయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎన్.దామోదర్, జిల్లా ఉపాధ్యక్షులు టి.సత్యనారాయణ, కె. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.