Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా స్వామివారి రథోత్సవం
- జాతరలో పాల్గొన్న వేలాది భక్తజనం
- ఉత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు గ్రామాల ప్రజలకు వనభోజనాలు
- సీఐ లింగయ్య ఆధ్వర్యంలో భద్రతా చర్యలు
నవతెలంగాణ-యాచారం
మండల పరిధిలోని నల్లవెల్లిలో శ్రీ బొగ్గుల గుట్ట సీతారామచంద్రస్వామి ఆలయ జాతర శుక్రవారం వైభవో పేతంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ గండికోట యాద య్య, కమిటీ సభ్యులు కలిసి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల కేకల నడుమ నిర్వహించారు. మండల పరిధిలోని నల్లవెల్లి, మాల్, తమ్మలోనిగూడ, చింతపట్ల గ్రామాల ప్రజలు జాతర సందర్భంగా వన భోజనాలకు వెళ్లారు. శ్రీ సీతారామచంద్రస్వామి జాతర ఉత్సవాలను పురస్కరించు కొని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, తనయుడు అభిషేక్ రెడ్డి రథోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల రైస్ మిల్లర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఊరే శ్రీనివాస్ గుప్తా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. జాతర ఉత్సవాలలో ఎలాంటి ఘటనలు జరగకుండా సీఐ లింగయ్య భక్తులకు భద్రతా చర్యలు చేపట్టారు. ఉత్సవంలో పోలీసులు పాల్గొని భక్తులకు సహాయ సహకారాలు అందించారు. రథోత్సవ అనంతరం ఆలయ కమిటీ వచ్చిన అతిథులకు శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తాగునీరు, పెద్ద ఎత్తున అన్నదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డేరంగుల రాజు, ఉప సర్పంచ్ వినోద్, ఎంపీటీసీ ఈదులకంటి లక్ష్మీపతి గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు కాసాని సత్తయ్య, జిల్లా శోభ రాములు, పొన్నగంటి మోహన్, అమనిగంటి యాదయ్య, పాలకూర లక్ష్మీపతి గౌడ్, ఓరుగంటి యాదయ్య, కాసాని రవి, ప్రజా ప్రతినిధులు రాజకీయ ప్రముఖులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.