Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-ఆమనగల్
ఆమనగల్ మార్కెట్ యార్డ్ ఎదుట హైదారాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి పక్కన దుకాణ సముదాయ నిర్మాణానికి రూ.62 లక్షలు మంజూరైనట్టు మార్కెట్ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయినట్టు తెలిపారు. ఆమనగల్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ ఆదాయం పెంపు, రైతులకు సదుపాయాల కల్పనకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అమనగల్లు మార్కెట్ యార్డ్ ఎదుట 8 దుకాణాల సముదాయం నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తా మన్నారు. మార్కెట్ యార్డ్ పరిధిలోని తలకొం డపల్లి క్రాస్ రోడ్ వద్ద గల గోదాము చుట్టు ప్రహరీ నిర్మాణానికి నిధుల మంజూరుకు ప్రభుత్వానికి నివేదించినట్లు ఆయన తెలిపారు కడ్తూ మండల కేంద్రంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి పక్కన మార్కెట్ యార్డు చెక్ పోస్ట్ భవన నిర్మాణానికి రూ.7.5 లక్షలు మంజూరయ్యాయని, పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మార్కెట్ యార్డులో రైతుల సౌకర్యార్థంగా పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు తయారు చేసి మార్కెటింగ్‌శాఖకు నివేదించామని వివరించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా పండించిన పంట ఉత్పత్తులు మార్కెట్ యార్డులో విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.