Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఐఎం కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షులు ఎస్బి గుల్షన్
నవతెలంగాణ-కొడంగల్
కొడంగల్ పట్టణ కేంద్రంలోని వినాయక చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టపానకు అనుకూలమైన స్థలం కాదని, ఎంఐఎం కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్బి గుల్షన్ అన్నారు. ఇరుకుగా ఉన్న వినాయక కూడలిలో ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారన్నారు. వినాయక కూడలిలో రోడ్డు ఇరుకుగా ఉన్నందున, ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు ప్రతినిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారన్నారు. విగ్రహ ప్రతిష్టాపన శంకుస్థాపన రోజున పట్టణ వాసులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే బాగుండే దన్నారు. ఇరుకైన రోడ్డులో విగ్రహ ప్రతిష్టాపన చేయడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, విగ్రహ ప్రతిష్టాపనకు తాము వ్యతిరేకం కాదనీ, వినాయక చౌరస్తా మీదుగా ముస్లిం శ్మశాన వాటికకు వెళ్లే మార్గం కావడంతో పాటు, ఈద్గాకు కూడా వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో అక్కడ వినాయకుడి విగ్రహ ఏర్పాటుతో ఎవరైనా ముస్లిం సోదరులు చనిపోయిన సమయాల్లో అంత్యక్రియల కోసం స్మశాన వాటికకు తీసుకెళ్తున్నప్పుడు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. వినాయక చౌరస్తాలో విగ్రహ ప్రతిష్టాపన విషయంలో గతంలో కొడంగల్ సీఐగా ఉన్న రామారావు, ఎస్సై అశోక్ ల ఆధ్వర్యంలో పట్టణంలోని పెద్దలతో మాట్లాడిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అంగీకారానికి ఒప్పుకోవడం జరిగిందనీ గుర్తుచేశారు. సమావేశంలో ఎంఐఎం నాయకులు సయ్యద్ ముస్తఫా, షేక్రూమన్, ఎండి.ముర్తాజ, షేక్ అజార్, ఎండి.రజాక్, ఎండి.సర్తజ్ తదితరులు పాల్గొన్నారు.