Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతీయ కిసాన్ సంఘ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరెడ్డి సత్యనారాయణరెడ్డి
నవతెలంగాణ-చేవెళ్ల
రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేయాలని భారతీయ కిసాన్ సంఘ జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరెడ్డి సత్యనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం భారతీయ కిసాన్ సంగ్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల సమావేశం మార్కెట్ యార్డ్లో నిర్వహించి, పలు అంశాలపై చర్చించినట్టు ఆయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల హక్కులు విధివిధానాల గురించి పరిశీలించుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో వినతిపత్రం సంబంధిత అధికారులు వివరణ, జవాబు, సూచనలు, సలహాలు లిఖితపూర్వకంగా (రాతపూర్వకంగా) ఇచ్చి,వాటిపై చర్చించుకున్నట్టు తెలిపారు. రైతుల సమస్యలపై విద్యుత్ సీఎస్పీ సెంటర్ సంబంధిత సమస్యలపై వినతిపత్రం అందజేసినట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో భారతీయ కిసాన్ సంగ్ మండలాధ్యక్షులు తిప్పని పెంటారెడ్డి, సభ్యులు శివుడు, మల్లారెడ్డి, వీరేశం, రైతులు నరసింహారెడ్డి, కిష్టయ్య, అంజయ్య, రామచంద్రయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.