Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ కిష్టమ్మ, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ప్రారంభించిన వైద్య శిబిరం
- శిబిరంలో 295 మందికి వైద్య పరీక్షలు
నవతెలంగాణ-తలకొండపల్లి
తలకొండపల్లి మండలంలోని చుక్కాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని గ్రామస్తులందరూ సద్వినియోగించుకోవాలని స్థానిక సర్పంచ్ కిష్టమ్మ అన్నారు. సోమవారం చుక్కపూర్ గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ప్రారంబించారు.ఈ శిబిరంలో 295 మంది వైద్య పరీక్షలు చేసి, అవసరమైన మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ నిరు పేదలకు సేవలు అందించాలనే లక్ష్యంతో నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైద్యులు దివ్య, అక్షయ, సంతోష్, మనిషా, నాయకులు మాజీ ఎంపీటీసీ యాదయ్య, రంగారెడ్డి, తాలూకా గౌడ సంఘం కన్వీనర్ అశోక్ గౌడ్, కుమార్, వెంకటయ్య, రాఘవేందర్, శేఖర్ రెడ్డి, లింగయ్య, మల్లేష్, చంద్రశేఖర్, బిక్కుగౌడ్, నాగిళ్ల జగన్, శేఖర్, మధు, రాకేష్, వెంకటేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.