Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ ప్రజా విధానాలు ప్రజలకు వివరిస్తాం
- ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం
- తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు ఎం.ప్రభులింగం
నవతెలంగాణ-మొయినాబాద్
'బీజేపీ కో హాటోదేశ్ కో బచావో' పేరుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రంలో ప్రతీ గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లి ప్రధాని మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు తెలియజేస్తామని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు ఎం. ప్రభులింగం అన్నారు. సోమవారం మొయినాబాద్ మండల కేంద్రంలో ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు ఇంటింటికీ సీపీఐ వాల్పోస్టర్ను ఆయన ముఖ్య అతిథుగా హాజరై, ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభులింగం మాట్లా డుతూ 'బీజేపీ కో హాటోదేశ్ కో బచావో' పేరుతో దేశ వ్యాప్తంగా ప్రతీ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లి ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రజా వ్యతిరేక విధానాలు, దేశంలో వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాయాలు, దేశ సమైక్యత సమగ్రతకు జరిగే ప్రమా దాలపై ప్రజలకు వివరించనునట్టు తెలిపారు. అంతే కాకుండా ప్రమాదకర ఫాసిస్టు నిరంకుశ హిట్లర్ తరహా పాలలను అందిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ఓడించి వామపక్ష ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులతో కూడిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా ప్రజలను చైతన్యపరిచే పాదయాత్రలను ప్రజా పోరు యాత్రలను వివిధ రూపాల్లో చేపట్టి ప్రతి గ్రామాన్ని సందర్శించన్నుట్టు సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు కార్యకర్తలందరూ సంసిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ శ్రేణులతో పాటు అన్ని రకాల కార్మిక వర్గం రైతులు, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని ఇంటింటీకీ సీపీఐ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుధాకర్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు బి. సుభాన్రెడ్డి, ఏఐటీ యూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, పార్టీ మండల కార్యదర్శి కె. శ్రీనివాస్ సహాయ కార్యదర్శి జాంగిర్ చేవెళ్ల మండల కార్యదర్శి మల్గారి సత్తిరెడ్డి సహాయ కార్య దర్శి ఎండీ మక్బుల్ బీకెంఎంయూ జిల్లా అధ్యక్షులు జె. అంజయ్య, ఏఐటీయూసీ చేవెళ్ల మండల అధ్యక్షులు శివ ప్రధాన కార్యదర్శి డప్పు శివయ్య, ఆర్. సత్తయ్యగౌడ్, పి. శ్యాంసుందర్ , కె. నరేందర్, ఎం. వెంకటయ్య, ఎండీ జలీల్ ఒగ్గు సత్యనారాయణ, చేవెళ్ల మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మంజుల, మాధవి, విజయమ్మ, సాయిలమ్మ, మీనాక్షి పాల్గొన్నారు.