Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటి డీఎంహెచ్వో డాక్టర్ దామోదర్
నవతెలంగాణ-శంకర్పల్లి
ప్రజల ఆరోగ్య సమస్యల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ దామోదర్ అన్నారు. సోమవారం శంకర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద సీపీఆర్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ ప్రసాద్, దామోదర్ మాట్లాడుతూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ గుండెపోటు (ఆర్ట్ స్ట్రోక్) వస్తున్నాయన్నారు. వస్తే వాటి వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానిపై క్లుప్తంగా వివరిం చడం జరిగిందన్నారు. బ్రీతింగ్ ప్రాబ్లం, శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉండడం, తదితర అంశాలపై డాక్టర్లకు సిబ్బందికి వివరించడం జరిగిందన్నారు.ప్రమాదం జరిగిన ప్పుడు ప్రథమ చికిత్సలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. ఎవరు కూడా ఇందులో నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్పల్లి, టంగుటూరు డాక్టర్లు రేవతి, సత్యజ్యోతి, సీహెచ్వో గోపాల్ రెడ్డి, హెచ్ఈవో సుదర్శన్, బలరాం, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.