Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీఎస్యూ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్
నవతెలంగాణ-చేవెళ్ల
గొప్ప దేశభక్తుడు, ప్రపంచ వేథావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని పీడీఎస్యూ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్ అన్నారు. ఏప్రిల్ 14న ప్రపంచ మేథావి, భారతరత్న, మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చేవెళ్ల మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీకి పీడీఎస్యూ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రాజేష్ మాట్లాడుతూ.... భారత దేశంలో 80 శాతం మంది ప్రజలు బానిసలుగా ఉన్నారని అన్నారు. మొదటి భారతీయ నాయకుడు డాక్టర్ అంబేద్కర్ స్వరా జ్యం వస్తేనే, రాజకీయ అధికారం పొందితేనే వారికి విముక్తి ఉంటుందన్నారు. దళిత విముక్తితోనే భారతదేశ ప్రగతి ముడిపడి ఉందన్నారు.ఈ దేశ అభివృద్ధి అన్న అంబేద్కర్ కన్నా గొప్పగా మన దేశం గురించి ఆలోచించిన దేశభక్తుడు స్వతంత్ర ఉద్యమ చరిత్రలోనే లేరన్నారు.' దళిత జాతీ విద్యార్థులకు ఉమ్మడి కళాశాలల స్థాపన, ఉపకార వేతనాల మంజూరు, వారి ఉన్నత విద్యాభ్యాసానికి, విదేశీ చదువులకు సహాయం చేయడం, దళిత జాతులను పోలీసు, మిలిటరీ సర్వీసుల్లోకి తీసుకోవడం లాంటి వాటిని ముందుగా ఊహించి భారత రాజ్యాంగం'లో వారి హక్కులను రూపొందించిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.అనంతరం గ్రామ సర్పంచ్ ఎన్ సులోచన, కెప్టెన్ ఎన్. అంజన్ గౌడ్, ఉపసర్పంచ్ అనసూజా కలిసి, పీడీఎస్యూ నాయకులను శాలువతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పీడీ ఎస్యూ చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు కోజ్జంకి జైపాల్, కార్యదర్శి బొజ్జి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు సురేష్, అశోక్, శివ ప్రసాద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.