Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫీల్డ్ అసిసెంట్ మండల అధ్యక్షులు కాకి నరసింహ
- నిరసన తెలిపిన ఫీల్డ్ అసిస్టెంట్లు
నవతెలంగాణ-తలకొండపల్లి
సర్పంచ్ తన అనుచిత వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ మండల అధ్యక్షులు కాకి నరసింహ అన్నారు. మంగళవారం తలకొండపల్లి మండల కేంద్రంలో ఎంపీటీవో కార్యాలయం ఎదుట ఫీల్డ్ అసిస్టెంట్ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పడకల్ గ్రామంలో 9వ తేదీన సర్పంచ్ ఒక ఫీల్డ్ అసిస్టెంట్ భార్యను అసభ్యకరంగా మాట్లాడటం సరైంది కాదన్నారు. మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని దుయ్యబట్టారు.ఒక దళిత సర్పంచ్ అయి ఉండి, మరో దళిత ఫీల్డ్ అసిస్టెంట్ పైన కక్షలు సాధించడం ఏమిటని నిలదీశారు. వ్యక్తులపై ఏమైన ఆరోపణలు ఉంటే పై అధికారులకు ఫిర్యాదు చేయాలి గానీ, మహిళను గ్రామపంచాయతీలో మండల అధికారుల ఎదుటనే అసభ్యకరంగా మాట్లాడటం సరైంది కాదన్నారు. ఇబ్బందికంగా మాట్లాడినందుకే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఆమెకు ఏలాంటి హాని జరిగినా పూర్తి బాధ్యత సర్పంచ్ వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆమెకు న్యాయం జరిగే వరకూ ఫీల్డ్ అసిస్టెంట్లు, యూనియన్ అండగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా సర్పంచ్ ఇష్టానుసారంగా అనుచిత వాఖ్యలు చేసినా, రాష్ట్రస్థాయిలో తమ యూనియన్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి మండలం అధ్యక్షులు కాకి నరసింహ, ప్రధాన కార్యదర్శి కృష్ణ, ఉపాధ్యక్షురాలు మంగమ్మ, కోశాధికారి రాములు, వెంకటేష్, సాల్వయ్య, రామచంద్రయ్య, లక్ష్మీదేవి ,నరసింహ, రాములు, సత్యనారాయణ, చిన్నారెడ్డి ,చంద్రయ్య, బాల్ బాల చెన్నయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు.