Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రివార్డ్ అందుకున్న ఎస్ఐ
- తండ్రిని నరికిన కేసులో కొడుకుకు శిక్ష
నవతెలంగాణ-యాచారం
రాచకొండ పోలీస్ కమిషనర్ డీిఎస్. చౌహన్, మంగళవారం యాచారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ వి. ప్రసాద్‌కు రివార్డు అందజేశారు. యాచారం మండల పరిధిలోని పిల్లిపల్లి గ్రామానికి చెందిన మొగిలమోని వెంకటయ్య కొడుకు పర్వతాలు భూమి విషయంలో గతంలో తండ్రి పైన గొడ్డలితో దాడి చేసి కాలు నరికాడు. ఈ విషయంపై ఎస్ఐ ప్రసాద్ నిందితుడు పర్వతాలుపై కేసు నమోదు చేసి శిక్షపడేలా చేశాడు.
నిందితుడికి ఏడేండ్ల ్ల జైలు శిక్షతోపాటు కఠిన గారాశిక్ష పడేలా చూశాడు. ఈ విషయంపై రాచకొండ సీపీ చౌహన్, ఎస్ఐని అభినందించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో సీఐ లింగయ్య ఎస్ఐని అభినందించారు. ఎస్ఐ ప్రసాద్ రాచకొండ పోలీస్ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.