Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్
- మద్దెలకుంట తండాలో మురుగు కాలువ నిర్మాణానికి నిధులు మంజూరు
నవతెలంగాణ-ఆమనగల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తండాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని జిల్లా పరిషత్ గ్రామీణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ మండల జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. కడ్తాల్ మండలంలోని రావిచేడ్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మద్దెల కుంట తండాలో అంతర్గత మురుగు కాలువ నిర్మాణ పనులకు జెడ్పీ నిధుల నుంచి మంజూరైన రూ.6.50 లక్షల ప్రొసిడింగ్ పత్రం మంగళవారం మండల కేంద్రంలోని తన నివాసంలో జడ్పీటీసీ దశరథ్ నాయక్ తండా నాయకులకు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బొప్పిడి గోపాల్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు బాలకృష్ణ, ఉపసర్పంచ్ వినోద్, వార్డు సభ్యులు మల్లేష్, రమేష్, రాజు, ఉపేందర్, రమేష్, శ్రీను, సాయికుమార్, కృష్ణయ్య, యాదగిరి, గోపాల్, రవి తదితరులు పాల్గొన్నారు.