Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలుష్యం రాకుండా కంపెనీల ఏర్పాటు
- ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాస్తానని హామీ
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- 400 మంది భూనిర్వాసితులకు ఇండ్ల స్థలాలు పట్టాలు అందజేత
- వడ్డెరలకు రూ.10 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన
నవతెలంగాణ-కందుకూరు
ఫార్మాసిటీ భూ నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం కల్పించనున్నట్టు సీఎం కేసీఆర్ హామీనిచ్చినట్టు విద్యాశాఖ మంత్రది సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం కందుకూరు మండల ముచ్ఛర్ల గ్రామ పంచాయతీ ఆవరణలో ఆ గ్రామ సర్పంచ్ ఇంజమూరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఫార్మా భూ నిర్వాసితుల 400 మందికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలసి ఇండ్ల స్థలాల సర్టిఫికెట్టు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంపెనీల నుంచి కాలుష్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. సర్టిఫికెట్లు తీసుకున్నవారు ఏ పరిస్థితిలోనైనా ఇండ్ల స్థలాలు విక్రయించొద్దని సూచించారు. ఫార్మసిటీ ఏర్పాటు చేసినందు వల్లనే ఇక్కడ రైతు పొలాలకు ధరలు పెరిగాయని గుర్తుచేశారు. ఐదేండ్ల కాలంలోనే ఈ ప్రాంతమంతా ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు. భఫర్ జోన్ అని అవాస్తవాలను ప్రచారం చేయకూడదని విన్నవించారు. 107 మందికి వివిధ కారణాల వల్ల ఇండ్ల స్థలాల సర్టిఫికెట్ ఇవ్వలేదని తెలిపారు. కొంతమంది ఆదార్ కార్డులు అందజేయలేదని, మరికొంత మంది ఫొటోలు ఇవ్వలేదన్నారు. ఈనెల 15 తేదీలోపు గ్రామపంచాయతీ ఆవరణలో రెవెన్యూ అధికారులు వస్తారనీ, వారికి తమ సమస్యల పరిష్కరించుకోవాలని సూచించారు. 600 ఎకరాలలో 2000 పైబడి రైతులకు ఇండ్ల స్థలాల సర్టిఫికెట్ అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మహేశ్వరం మార్కెటింగ్ చైర్మెన్ సురసాని సురేందర్ రెడ్డి, కందుకూరు సహకార సంఘం చైర్మెన్ దేవరశెట్టి చంద్రశేఖర్, ఆర్డీవో సురజ్ కుమార్, తహసీల్దార్ మహేందర్ రెడ్డి,బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మన్నె జయేంద్, రైతుబంధు మండల నాయకులు సోలిపేట్ అమ రేందర్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్ ఆనెగౌని అంజయ్యగౌడ్, లక్ష్మి నరసింహరెడ్డి, సర్పంచులు కాసుల రామకృష్ణారెడ్డి, నరేందర్ గౌడ్, బీఆర్ఎస్ మహిళా మండల అధ్యక్షురాలు దాసర్లపల్లి ఎంపీటీసీ ఇందిరమ్మ దేవేందర్, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, ముచర్ల ఎంపీటీసీ బక్క మల్లేష్, కాకి రాములు, నాయకులు ఈశ్వర్ గౌడ్, డైరెక్టర్ వెంకట్ రామ్‌రెడ్డి, పొట్టి ఆనంద్, నాయకులు విఘ్నేశ్వర్ రెడ్డి, చిర సాయిలు, జీ. సామయ్య, తాళ్ళ కార్తీక్, బొక్క దీక్షిత్ రెడ్డి, డైరెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి, పారిజాతం,నాయకులు ప్రవీణ్ నాయక్, మాజీ సర్పంచులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.