Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేశంపేట
మండల పరిధిలోని అల్వాల గ్రామంలో గ్రామ సర్పంచ్ తీర్మాల్ రెడ్డి శ్రీలత శ్రీనివాస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ -1బస్సు డిపో వారి ఆధ్వర్యంలో మంగళవారం వికలాంగులకు బస్సు పాసులు అందజేశారు. అదేవిధంగా కొత్తపేట సర్పంచ్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామంలోని వికలాంగులకు ఉచిత బస్సు పాసులను అందజేశారు. అల్వాల,కొత్తపేట గ్రామాల సర్పంచులు సొంత ఖర్చులతో తమ,తమ గ్రామాలల్లోని వికలాంగులకు ప్రభుత్వం అందించే ఉచిత బస్సు పాసుల అందజేసినట్టు తెలిపారు.అనంతరం సర్పంచ్కలకు, డిపో మేనేజర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవిచంద్ర కుమార్ రెడ్డి, ఏపీఎం భగవంతు, ఆర్టీసీ అధికారి, ఎంపీటీసీ మల్లేష్ యాదవ్, మండల కో-ఆప్షన్ సభ్యులు జమాల్ ఖాన్, ఉపసర్పంచ్ నరేష్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కృష్ణయ్య, బీఆర్ఎస్ నాయకులు ధనరాజ్ రెడ్డి, శ్రీనివాస్, సాయిలు, బీరయ్య, మహేష్, రాజేందర్, రమేష్, దర్శన్, షకీల్, కృష్ణయ్య, జగన్రెడ్డి, యాదయ్యగౌడ్, కృష్ణ, వెంకటేష్, సంతోష్ కుమార్, సాయి, గ్రామస్తులు పాల్గొన్నారు.