Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్ జడ్జి శ్రీదేవి
- ఇటుక బట్టి కార్మికులకు జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం
నవతెలంగాణ-శంషాబాద్
రంగారెడ్డి జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగవారం సుల్తాన్ పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోగల బట్టి కార్మికులకు ప్రపంచ ఆరోగ్య దినం పుర స్కరించుకొని ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. నర్కూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ దివ్య కార్మి కులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరం ఉన్నవారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఏ.శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులు లేబర్ గుర్తింపు కార్డులు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యం పట్ల కార్మికులు శ్రద్ధ వహించాలని ఏవైనా న్యాయ సంబంధమై న సమస్యలు వచ్చినప్పుడు రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థతో పాటు పారా లీగల్ వాలంటీర్స్ అందుబాటులో ఉంటారని చెప్పారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ప్రతినిధులకు కార్మికులు ధన్యవా దాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజ్‌కుమార్, లేబర్ ఆఫీసర్ వాల్యనాయక్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, పారా న్యాయ స్వచ్చంద సేవకు లు టీ.బాల్‌రెడ్డి, కె.సంజీవ, పి.శ్రీలత, శంకర్, బి.శ్రీలత, అంగన్వాడీ టీచర్స్, మెడికల్ సిబ్బంది, ఇటుక బట్టీ నిర్వాహకులు రాజు పాల్గొన్నారు.