Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్
- సీఐటీయూ ఆధ్వర్యంలో జ్యోతిబాఫూలే జయంతి
నవతెలంగాణ-రాజేంద్రనగర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం, దేశభక్తి పేరుతో కార్మికుల్లో చిచ్చు పెడుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ అన్నారు. మంగళవారం కాటేదాన్ లోని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమారికి భూపాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహానీయుల జయంతులు నిర్వహిస్తామన్నారు. కుల వివక్షత, అణచివేత దోపిడీలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తం గా క్యాంపెయిన్ చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింద న్నారు. 'రాజ్యాంగాన్ని సామాజిక న్యాయాన్ని కాపాడుకుం దాం, మనువాదాన్ని మట్టు పెడతాం, కుల వివక్షతను అం తం చేద్దాం, మతోన్మాద విచ్ఛిన్నకర శక్తులను ప్రతిఘటి ద్దాం, కార్మిక వర్గం ఐక్యతను కాపాడుకుందాం' అనే అంశాలపై మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తామన్నారు. 13న రాష్ట్ర వ్యాప్తంగా టెన్ కె వాక్ ఫర్ సోషల్ జస్టిస్ సామాజిక న్యా యం కోసం పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయించిన ట్టు తెలిపారు. దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీల పై జరుగుతున్న దాడులు, లైంగికదాడులు, కులవ్యవక్షతకు వ్యతిరేకంగా పోరాడే ప్రజా సంఘాలకు అండగా కార్మిక వర్గం నిలవాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వేల ఏండ్ల నుంచి బూజు పట్టిన మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తుందన్నారు. దీనిపై పోరాడా లన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఆఫీస్ బేవర్స్, జిల్లా కమిటీ సభ్యులు మండల కన్వీనర్లు, రంగాల వారీగా బాధ్యులు పాల్గొన్నారు.