Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాచుపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా
- పక్క సమాచారంతో బాలానగర్ ఎస్ఓటీ పోలీసుల రైడ్
- 10 మంది నిందితులను అరెస్ట్
- రూ.60లక్షల నగదు, రూ.కోటీ విలువచేసే ప్రాపర్టీ సీజ్
- పరారీలో విజయవాడకు చెందిన ప్రధాన నిర్వాహకుడు పాండు
- వివరాలను వెల్లడించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
నవతెలంగాణ-మియాపూర్
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బాచుపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.60లక్షల నగదు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకు న్నారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు పాండు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల ను సైబరాబాద్ సీపీ కార్యాయలంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం మీడియాకు వెల్లడించారు. బాచుపల్లిలోని సాయి అనురాగ్ అపార్ట్‌మెంట్‌ను అడ్డాగా మార్చుకున్న క్రికె ట్ బుకీలు అక్కడి నుండే కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకు ని ఐపీఎల్, ఇతర అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. ఆర్సీబీ, లక్నో సూపర్‌జెయింట్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ సోమవారం జరిగింది. బెట్టింగ్ విషయం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించా రు. ఈ దాడుల్లో ఈ ముఠాకు చెందిన 10 మంది బుకీల ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. అరెస్టయిన వారిలో వై.వెంకట శివరామ, కృష్ణ, సింగమనేని కిరణ్‌కుమార్, నందం శ్రీనివాస్ బాబు, కడియాల మహేష్, చెరెడ్డి కాశీ, అద్దేపల్లి ప్రతాప్ గణకుమార్, కె.విజరుకుమార్, జి.శ్రీకాంత్, ఎ.వినరు, బి.వెంకట రత్నకుమార్ ఉన్నారు. డిజిటలైజే షన్, అధికంగా డబ్బులు సంపాదించాలనే ఆరాటంతో కొందరు క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఆర్గనైజింగ్ బెట్టింగ్ ముఠా ఎవరైతే బెట్టింగ్ కు ఆసక్తి ఉన్నారో తెలుసుకుని వారిని ఆకర్షిస్తూ బెట్టింగ్‌లోకి దింపుతున్నారు. ఈ ముఠా వద్ద నుంచి రూ. 60 లక్షల నగదుతో పాటు, బ్యాంక్ అకౌంట్లో ఉన్న రూ.ఐదు లక్షల 89 వేలను ఫ్రీజ్ చేశారు. బెట్టింగ్ సామాగ్రి, సెల్ ఫోన్లు, కీ బోర్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన కీలక సూత్రధారి పాండు పరారీలో ఉన్నాడు. యువత బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.