Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వచ్చే ఎన్నికల్లో సేమ్ రిజర్వేషన్ ఉంటుందని అంచనా
ప్రజలను మచ్చక చేసుకోవడానికి వ్యయా ప్రయాసలు
మరోసారి ప్రజా క్షేత్రంలో తమ అవకాశాన్ని పరీక్షించుకోవడానికి పావులు కదుపుతున్నారు
నవతెలంగాణ- శంషాబాద్
ఒకసారి అధికారం అనుభవించిన సర్పంచులు రెండో సారి అధికారం దక్కించుకోవడానికి అనేక ఎత్తుగడలు వే స్తున్నారు. ప్రజలతో మమేకమై చేయాల్సిన పనులన్నీ చే స్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం జీపీ సర్పంచుల రిజర్వే షన్ 10 ఏండ్ల వరకు ఉంటుందని గత జీపీ ఎన్నికల సందర్భంలో ఆదేశాలు ఇచ్చింది. ఈసారి మరో అవకాశం ఉంటుందని అంచనాలతో ప్రస్తుత సర్పంచులు ఉన్నారు. సర్పంచుల పదవీకాలం చూస్తుండగానే 4 ఏండ్లు గడి చింది. ఇంకా 9 నెలల పదవీకాలం ఉంది. శంషాబాద్ మండలంలో 27 గ్రామ పంచాయతీలుంటే ఇందులో 9 గిరిజన గ్రామపంచాయతీలు ఉన్నాయి. బీసీలకు 27 శాతం గ్రామ పంచాయతీలు, మిగతా ఎస్సీ, ఎస్టీ జనరల్ కేటగిరి గ్రామపంచాయతీలో ఉన్నాయి. రిజర్వేషన్లలో 50 శాతం గ్రామపంచాయతీలు మహిళలకు కేటాయించబ డ్డాయి. 4,5 గ్రామపంచాయతీలలో ఇప్పటికే రెండుసార్లు పైగా సర్పంచ్ పదవులు అనుభవించి ఉన్నారు. 2018లో అధికారం చేపట్టిన సర్పంచులు 2019 డిసెంబర్లో వ చ్చిన కోవిడ్-19 కారణంగా గ్రామపంచాయతీ సర్పం చు ల పదవీ కాలం 2 ఏండ్లు వృథా అయిందన్న భావనలో ఉన్నారు. మళ్లీ 2022 నుంచి సర్పంచులు మెల్ల మెల్లగా అధికారాన్ని అనుభవిస్తూ వస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దీన్దయాల్ ఉపాధ్యారు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులను శంషాబాద్ మండల సర్పంచులు ఎక్కువ మొత్తంలో అందుకున్నారు. దీంతో సర్పంచ్లల్లో ఉత్సాహం నెలకొన్నది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ వచ్చే జీపీ ఎన్నికల్లో కూడా ఉంటుందన్న అంచనా ప్రస్తుత సర్పం చులకు ఉన్నది. వచ్చే ఎన్నికల్లో అవకాశాన్ని జారవిడుచు కోవద్దన్న పట్టుదలతో ఉన్నారు. మరోసారి ప్రజా క్షేత్రంలో తమ అవకాశాన్ని పరీక్షించుకోవడానికి పావులు కదుపుతున్నారు. 3 ఏండ్ల పాటు ఎంతో కఠినంగా వ్యవహ రించిన సర్పంచులు సైతం తర్వాత ప్రజలతో కలిసి కార్యక్ర మాలు చేస్తున్నారు. పార్టీ అగ్ర నాయకులకు ఎమ్మెల్యేకు పూర్తి విధేయతగా ఉంటూ వస్తున్నారు. గ్రామ ప్రజల సా మూహిక భోజన కార్యక్రమాలు వ్యయ ప్రయా సలకు ఓర్చు కుని జరిపిస్తున్నారు. వివాహాలు ఇతర కార్యక్ర మాలకు హాజరై వివిధ రూపాల్లో సహాయాన్ని అందిస్తున్నా రు. తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విషయంలో ఉదా సీన వైఖరి కారణం కూడా వీరికి కలిసి వస్తున్నది. అప్పటి వరకు రియల్ ఎస్టేట్ విషయంలో కఠినంగా వ్యవహరించి అడ్డుకున్న సర్పంచులు ఇటీవల కాలంలో వాటిని ప్రోత్సహి స్తున్నారు. 111 జీఓ పరిధిలో నిర్మాణాలకు సం పూర్ణ మ ద్దతు ప్రకటిస్తున్నారు. ప్రజలు తమవైపే ఉండేలా కూడా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభు త్వం గతంలో ప్రకటించిన విధంగానే రిజర్వేషన్లు అమ ల్లో ఉంటే ఈసారి వారే ఎక్కువ మంది సర్పంచ్ పోటీలో ఉండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.