Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్
- విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ వి. రవీందర్ రెడ్డి
నవతెలంగాణ-రాజేంద్రనగర్
పీపీ నరసింహారావు తెలంగాణ పశువైద్యవిశ్వ విద్యా లయం 4వ స్నాతకోత్సవం ఈ నెల 16వ తేదీన రాజేం ద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యా లయ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించబడుతుందని విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ వి. రవీందర్ రెడ్డి తెలిపారు. గురువారం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస న విలేకరుల సమావేశంలో ఉపకులపతి ప్రొఫెసర్ వి.రవీందర్ రెడ్డి మాట్లాడుతూ స్నాతకోత్సవ కార్యక్రమం లో రాష్ట్ర గవర్నర్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డా. తమిళి సైసౌందరరాజన్ హాజరై విద్యార్థులకు పట్టాలు అందజేస్తా రని ఆయన తెలిపారు. 2022వ సంవత్సరంలో ఉత్తీర్ణులైన 132 పశువైద్యం, 24 డైరీ టెక్నాలజీ, 23 ఫిష రీస్ సైన్సెస్, 49 పీజీ 11పిహెచ్డి, మొత్తం 239 విద్యార్థులు పట్టాలను అందజేయనున్నారు. వివిధ రంగా ల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరచిన 7 గురు విద్యార్థులకు 12 బంగారు పతకాలను అందజేస్తారని ఆయన స్పష్టం చేశారు. 82 సంవత్సరాల యువ విశ్వవిద్యాలయం వరం గల్లోని మామూర్‌లో కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, పెబ్బైర్ కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ అనే 2 కొత్త కళాశాలలను స్థాపిం చడం సిద్దిపేటలో మరో కొత్త వెటర్నరీ కాలేజీ ప్రారంభిం చడానికి ఏర్పాట్లు చేయడం, పౌల్ట్రీ రీసెర్చ్ స్టేషన్, హైదరాబాద్ పౌల్ట్రీ సీడ్ ప్రాజెక్ట్, మమ్నూర్ ద్వారా సుమా రు 1.5 లక్షల రాజశ్రీ కోడిపిల్లలు రైతులకు సరఫరా చేశా మన్నారు. గవర్నర్ సహకారంతో గిరిజన వర్గాల కోసం పోషకాహార కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆదిమ గిరిజన గ్రూపు రైతులకు, పెరటి కోళ్ల మెరుగైన రకం పంపిణీ, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్,ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నా లజీని ఉపయోగించి 264 పిండాలను, 4 సాహివాల్ దూ డలనువిజయవంతంగా ఉత్పత్తి చేయడం, పశువుల చికిత్స కోసం సూపర్ స్పెషాలిటీ పశువైద్య హాస్పిటల్ ద్వారా క్లినికల్ కాంప్లెక్స్ ఎక్స్-రే యూనిట్‌తో సహా అల్ట్రా సౌండ్ స్కానింగ్, ఎండోస్కోపీ, డయాలసిస్ యూనిట్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయడం వంటి ఎన్నో పరిశోధన రైతు విస్తరణసేవలతో యూనివర్సిటీ ముందు వరుసలో ఉందన్నారు. తెలంగాణ పాడి పశువుల సంర క్షణకు తనవంతు పాత్ర పోషిస్తుందన్నారు.