Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిర్సంపల్లి గ్రామంలో ఘటన
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి క్రిమిసంహారక మందుతాగి చికిత్స పొం దుతూ మృతి చెందాడు. ఘటన దోమ మండల పరిధిలోని దిర్సంపల్లిలో గురు వారం చోటుచేసుకుంది. ఎస్ఐ విశ్వజన్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఉప్పరి వెంకటేశ్(24) అనే వ్యక్తి పొలంలో వేసిన పంటల కోసం రూ. 3 లక్షల అప్పుడు చేశాడు. ఆ అప్పులు తీర్చలేక ఈ నెల 9వ తేది ఆదివారం పొలానికి పిచికారీ చేసే క్రిమీసంహారక మం దును సేవించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెం టనే అతన్ని నారాయణపేట్ జిల్లా కోస్గి ఆస్పత్రికి తరలిం చారు. అక్కడ అతని పరిస్థితి విషమించడంతో మహబు బ్నగర్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృ తి చెందాడు. మృతుడి సోదరుడు ఉప్పరి రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నామని ఎస్ఐ విశ్వజన్ తెలిపారు.
ఉప్పరి వెంకటేశ్ నేత్ర దానం
క్రిమిసంహారక మందు సేవించి మృతి చెందిన ఉప్పరి వెంకటేశ్ నేత్రా లను కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్ అస్పత్రికి దానం చేశారు. ఎల్వీ ప్రసాద్ అస్పత్రి వైద్యులు గురువారం మహ బూబ్‌నగర్‌లోని ప్రయివేటు ఆస్పత్రి చేరుకుని ఉప్పరి వెం కటేశ్ నేత్రా ల్లోని రేటీనాను సేకరించారు. అనంతరం మృ తదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్ట్‌మార్టం పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.