Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస్స చంద్రయ్య
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
వ్యవసాయ రంగానికి కీలకమైన వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర పశుమిత్రాల వర్కర్స్ యూనియన్ సీఐటీయూ అను బంధం పశుమిత్రలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బు స్స చంద్రయ్య అన్నారు. రాష్ట్ర పశుమిత్రాల వర్కర్స్ యూ నియన్ సీఐటీయూ అనుబంధం పశుమిత్రలను రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కీలకమైన వ్యక్తులు పాడి పరిశ్రమకు వెన్నెముక లాంటివారన్నారు. ప్రభుత్వ స్వయం సహాయక సంఘాలలో చురుకుగా ఉన్న సభ్యులు వీరంతా అన్నారు. పశుపోషకులకుగా పశుసంవర్ధశాఖకు మధ్య వారధిగా పనిచేస్తూ పశువులకు వైద్య సేవలు పశు పోషణ పై కల్పిస్తూ మార్కెటింగ్ సమాచార పశువుల బీమా సేవలు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 3 కోట్ల 50 లక్షల జీవాలకు మశూచి, గాలి కుంట, నీలినాలుక, గొంతువాపు, మూతి కాలి పుండ్లు వంటి 20 రకాల వ్యాధులకు చికిత్స అందిస్తూ గుడ్డు చాకిరి చేస్తున్నారని తెలిపారు. పశుమిత్రలు పశువులకు వైద్యం చేస్తున్న సందర్భంలో వీరికి కూడా వైరస్ సోకే అవకాశం ఉందన్నారు. వీరికి ప్రభుత్వ పరంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగస్తుల గుర్తించాలన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఎలక్ట్రిక్ బైకులు వీరికి కల్పించాలని కోరారు. జిల్లా యానిమల్స్ జెడికి పశుమిత్రులతో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస్స చం ద్రయ్య, పశుమిత్రలు వసంత, పూజలక్ష్మి, లావణ్య తది తరులు పాల్గొన్నారు.