Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
నవతెలంగాణ-పరిగి
ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. గురువారం పరిగి మండల పరిధిలోని ఇబ్రహీంపూర్, రూప్సింగ్ తండా, మల్కాపేట్ తండా, రూప్ఖాన్ పెట్, సుల్తాన్పూర్, లక్ష్మీదే విపల్లి గ్రామాల్లో నిర్వహించిన పల్లెబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొని ఆయా గ్రామాల్లో జెండాను ఎగరవేశారు. గ్రామాల్లో పూర్తయిన పనులను ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ప్రారంభించారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నా రు. ఇబ్రహీంపూర్ సర్పంచ్ బాలయ్య, లక్ష్మీదేవి పల్లి సర్పం చ్ రేణుక వెంకటేష్ ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ ప్రతి గడపకూ ఏదో రకంగా సంక్షేమ పథకాలు చేరుతున్నాయన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. నేడు గ్రామాల రూ పురేఖలే మారిపోయాయన్నారు. ముఖ్యంగా విద్యా వ్యవ స్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. సీఎం కేసీఆర్ బడిబాట కార్యక్రమం తీసుకొచ్చి పాఠశాల మౌలిక వసతులు కల్పించారని తెలిపారు. గతంలో పెన్షన్ 200 మాత్రమే ఇచ్చేవారు రాష్ట్రం వచ్చాక అర్హులైన వారికి రూ. 2 వేలు పెన్షన్ ఇస్తున్నామన్నారు. త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని తెలిపారు. విడతల వారీగా ప్రతి ఒక్కరికి దళితబంధు అందజేస్తామన్నారు. ఖాళీ స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షలు ఇస్తామన్నారు. దాడి తండాకు రూ.8 లక్షల సీసీరోడ్డు మంజూరు చేశా మన్నారు. మలకపేట తండా కూడా రోడ్డు శాంక్షన్ అయిం దన్నారు. పరిగిలో రూ.2 కోట్లతో బంజారా భవన్ నిర్మిస్తు న్నామన్నారు. ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంద న్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, తం డాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కూడా ఇస్తుందన్నారు. సుల్తాన్పూర్ గ్రామంలో కమిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని అన్నారు. అలాగే సీసీరోడ్డు నిర్మాణా నికి నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. లక్ష్మీదేవి పల్లి గ్రామానికి రోడ్డు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హరిప్రియ ప్రవీణ్ రెడ్డి. ఎంపీపీ అరవింద్ రావు, వైస్ ఎంపీపీ కావలి సత్యనా రాయణ, రైతుబంధు అధ్యక్షుడు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ బీఆర్ఎస్ పరిగి మండల అధ్యక్షుడు ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, సయ్యద్ పల్లి వెంకటయ్య, సయ్యద్ పల్లి రాములు, యాదయ్య, రామచందర్, ఎంపీటీసీ వెంకటరామిరెడ్డి, సుభాష్ చంద్రరెడ్డి, సర్పంచ్ సాలి భాయ, రమేష్ నాయక్, మాణిక్యం, జాక్ రవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.