Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛైర్పర్సన్ రేఖాయాదగిరి
- అంగన్వాడీ కేంద్రాలను సందర్శన
నవతెలంగాణ-గండిపేట్
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు విలువైన పోష కాలను అందించాలని ఛైర్పర్సన్ దార్గుపల్లి రేఖాయా దగిరి అన్నారు. గురువారం గౌలిదొడ్డిలోని అంగన్ వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ అద్యర్వంలో బాఆమృతం, పోషకాలపై అవగహాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎదుగుతున్న చిన్నారులు పోషకా లను అందించాలన్నారు. అధిక ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకునే విధంగా తల్లులు శ్రద్ద చూపాలన్నారు. గుడ్లు, పాలు, ఆకుకూరలు, బాలామృతాన్ని అందించాలన్నారు. తల్లులు, గర్బీణులకు అదనపు ఆహారాన్ని అందించా లన్నారు. ఈ కార్యక్రమంల్లో నార్సింగి సెక్టార్ సూపర్వైజ ర్ శారదా, అంగన్వాడీలు, ఆయాలు, తల్లులు, చిన్నారు లు తదితరులు పాల్గొన్నారు.