Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
విద్యార్థులను చిన్ననాటి తీపి జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకోవా లని స్కూల్ ఛైర్మెన్ భరత్‌కుమార్ అన్నారు. గురువారం నార్సింగిలోని నాగర్జున్ స్కూల్ గ్రూప్ శారదావిద్యనికేతన్ స్కూల్లో యూకేజీ గ్రాడు యేుషన్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నార్సింగి కమిషనర్ సత్యబాబు, కౌన్సిలర్ ఉషారాణి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పేద విద్యార్హులకు ఎలాంటి లాభపేక్ష లేకుండా విద్యను అదించాలన్నారు. విద్యార్థులను అన్ని రంగాల్లో ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాలని అన్నారు. తాము చదువుకున్న రోజుల్లో ఉపాధ్యాయులను వారు గుర్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంల్లో శానిటే షన్ సూపర్వైజర్ లచ్చయ్య నాయక్, ప్రిన్సిపాల్ పూర్ణిమా, ఉపాధ్యా యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.