Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక న్యాయం కోసం సమరం
- సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజు, చంద్రమోహన్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజు, చంద్రమోహన్ పిలుపునిచ్చారు.గురువారం సీఐ టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బొంగ్లూర్ గేట్ నుంచి తుర్కయంజాల్ ఆర్డీవో కార్యాలయం వరకు 10 కే వాక్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలపై జరుగుతున్న దాడులు, లైంగిక దాడులు, కుల, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడే ప్రజా సంఘాలకు అండగా కార్మికవర్గం నిలవాలని పిలుపునిచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితు లపై మూడురేట్లు హింస పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఉన్న ఊనా పట్టణంలో ఆవు మాంసం వలుస్తు న్నారనే నేపంతో నలుగురి దళిత యువకులను చెట్టుకు కట్టేసి కొట్టారన్నారు. ఒక దళితుడు గుర్రం ఎక్కడని కింద పడేసి కొట్టి చంపారన్నారు.ఉత్తర ప్రదేశ్లో ఓ దళిత యువతిని అత్రాస్లో గ్యాంగ్ రేప్ చేసి, నాలిక కోసి, నడుములు విరిచిన ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా తీసుకోలేదన్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందితే కనీసం ఆ శవాన్ని కూడా కుటుంబానికి ఇవ్వలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం కొన్నేండ్ల క్రితమే భూజు పట్టిన మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని ప్రయత్ని స్తుందన్నారు.జాతీయ వనరులను, ప్రభుత్వరంగ సంస్థలను కారు చౌకగా తన తాబేదారులకు కట్టబెడు తున్నదని ధ్వజ మెత్తారు. ప్రభుత్వంరంగాలను ప్రయివే టీకరిస్తే, దళిత, గిరిజన, బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు బీజేపీ ప్రభుత్వం గండి కొడుతుందన్నారు. కార్మిక సంఘాలపై, కార్మిక హక్కులపై, కార్మిక చట్టాలపై దాడులు చేస్తుందన్నారు. పోరాడి సాధించుకున్న 44కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చి వేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో 76 కుల దురహంకార హత్యలు జరిగాయనీ వెల్లడించారు. కులం పేరుతో సాంఘిక బహిష్కరణలు జరుగుతున్నాయన్నారు. జోగిని వ్యవస్థ ఇంకా అమల్లోనే ఉందన్నారు. ఆర్థిక పోరాటాలతో పాటు సామాజిక అణచివేత్త, కులవివక్షకు వ్యతిరేకంగా జమిలి పోరాటం చేస్తేనే మతోన్మాదాన్ని ఓడించడం సాధ్యమవుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధి కారి కవిత, జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్, కిషన్, రుద్రకుమార్, దేవేందర్, స్వప్న, సాయిబాబు జిల్లా నాయకులు బుగ్గరాములు, ఎల్లేష్, కురుమ య్య, ఎల్లయ్య, వీరయ్య, పాండు, జగన్, భాస్కర్, సత్యనారాయణ, సుమలత, జ్యోతి, శారద తదితరులు పాల్గొన్నారు.