Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ తిరుపతిరావు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఈ ఏడాది యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందనీ, ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటిస్తూ ధాన్యం కోనుగొలు చేయాలనీ అదనపు కలెక్టర్ తిరుపతి రావు సంబంధిత అధికారులను, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధ్యక్షతన వరి ధాన్యం కొనుగోలుపై వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లై అధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల అసోసియేషన్స్, రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో ఈ యాసంగిలో 26, 392.788 హెక్టార్లలో సాగు చేసిన వరి లక్షా 63 వేల 45 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేసినట్టు తెలిపారు. అందుకు తగినట్టుగా కొనుగోలు 37 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, ఆయా కేంద్రాల్లో ధాన్యానికి అవసరమైన 15 లక్షల బ్యాగులకు 13 లక్షల గన్ని బ్యాగులను సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలు, తేమ తొలగించే అంశం, తాలు నిర్మూలించడానికి ప్యాడీ క్లీనర్ల విని యోగం తదితర అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అదికారులు పెద్ద ఎత్తున రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కొను గోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొని వచ్చిన రైతుల వివరాలు ఆన్ లైన్లో ఖచ్చి తంగా నమోదు చేసి, టోకెన్ ఇవ్వాలనీ కొనుగోలు కేంద్రాల వారికి తెలిపారు. అవసరమైన టార్ఫాలిన్ కవర్లు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, ధాన్యం శుద్ధి యంత్రాలు, తేమ శాతం కొలిచే యంత్రాలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరు కలిసి సమిష్టిగా పని చేయా లని సంబంధిత అధికారులను, ధాన్యం కొనుగోలు కేంద్రాల వారిని, రైస్ మిల్లర్లకు సుంచించారు. ఈ సమావేశంలో జిల్లా రైతు బంధు సమితి చైర్మెన్ వంగేటి లక్ష్మా రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీత, మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి, సివిల్ సప్లై అధికారులు మనోహర్ రాథోడ్, శ్యామా లక్ష్మి, కొనుగోలు కేంద్రాల అసోసియేషన్స్ చైర్మెన్స్, రైస్ మిల్లరులు, వ్యవసాయ శాఖ ఏడీలు, ఏఈఓలు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.