Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
- అగ్నిమాపక వారోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
వేసవిలో సంభవించే అగ్ని ప్రమా దాలతో ప్రజలు, వ్యాపారస్తులు అప్రమ త్తంగా ఉండాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నం డివిజన్ అగ్నిమాకపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వార్షికోత్సవాల వాల్పోస్టర్ను గురువారం తన కార్యాలయంలో ఫైర్ స్టేషన్ ఆఫీసర్ నాగేశ్వరరావు, సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలంలో అధిక ఉష్ణో గ్రతతో సంభవించే అగ్ని ప్రమాదాలు, వ్యాపార సము దాయ భవనాల్లో విద్యుత్ సమస్యల వల్ల తలెత్తే ప్రమా దాల వల్ల, వ్యవసాయ క్షేత్రాలలో, అడవులలో జరిగే ప్రమాదాలతో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. విపత్తులు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు జాగ్రత్తలు పాటించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలియజేసి వారి సేవలు పొందాలని సూచిం చారు. అగ్ని ప్రమాదాలు తలెత్తడానికి గల కారణాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్ర త్తలపై ఆ శాఖ ఆధ్వర్యంలో వారం రోజులపాటు నిర్వ హించే అంశాలను ప్రజలు, వ్యాపారస్తులు, రైతులు తెలుసుకుని ఆ సూచనలు పాటించాలని సూచించారు. వారం రోజులపాటు జరిగే వార్షికోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం స్టేషన్ ఆఫీసర్ నాగేశ్వరరావు, సిబ్బంది వెంకటయ్య, జ్ఞానేశ్వర్, నరసింహ, చంద్రశేఖర్, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.