Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం ద్వారానే జీవితంలో విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకోవడం సాధ్యమవుతోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. వైష్ణవీ గార్డెన్లో జరిగిన కార్తికేయ డిగ్రీ కళాశాల వారోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదలతో చదివితే అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారని చెప్పారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు మట్టిలో మాణిక్యాలనీ, ఆత్మనూ న్యతాభావం విడనాడితే వారికి ఎదురుండదన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అధిక మంది ఉన్నతాధికారులుగా నేడు ప్రభుత్వంలో సేవ లు అందిస్తున్నారని తెలిపారు. వారిని ఆదర్శంగా తీసు కుని ఎదగాలని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులు తమ కడుపులు మాడ్చుకుని తమ పిల్లల ఎదుగుదలకు కృషి చేస్తున్నారనీ, వారికలలను నెరవేర్చాల్సిన భాద్యత విద్యార్థులుపై ఉందన్నారు. డిగ్రీ కళాశాల విద్యార్థులు వేసిన సాంస్కృతిక కళారూపాలు విశేషంగా ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పాండురంగారెడ్డి, డైరెక్టర్లు చంద్రకాంత్, వెంకటేశంగౌత్, రాజేందర్, అజ్ఞాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.