Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ గోవర్థన్‌రెడ్డి
నవతెలంగాణ-శంకర్పల్లి
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రొబిషనరీ పీరియడ్ నాలుగేండ్లు పూర్తైన సందర్భంగా శంకరపల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం శంకరపల్లి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులు కేక్ కట్ చేసి, ఒకరినొ క్కరు స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ కార్య దర్శులు మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషనరీ పీరియడ్ నాలుగేండ్లు పూర్తైన సందర్భంగా క్రమబద్ధీకరణ ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వం 2019 ఏప్రిల్‌లో 12న ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండాలని సంకల్పంతో పంచాయతీ కార్యదర్శులను నియమించినట్టు గుర్తు చేశారు. నోటిఫికేషన్ ప్రకారం మూడేండ్లకే క్రమబద్ధీకరించాల్సి ఉండగా జీవో నెంబర్ 26 జారీతో మరో ఏడాది ప్రొబేషన్ పెంచగా, ఏప్రిల్ 12తో నాలుగేండ్లు పూర్తైనట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో కార్యదర్శులను వెంటనే క్రమబద్ధకరించాలని పంచాయతీ కార్యదర్శులు కోరారు. తమ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చొరవ చూపాలని ఎంపీపీని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకయ్య, సూపరింటెండెంట్ రవీందర్, ఎంపీవో గీత, సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టు, కంప్యూటర్ ఆపరేటర్లు, గ్రామ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.