Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ శంకర్పల్లి మండల కార్యదర్శి పి. సుధీర్‌కుమార్
నవతెలంగాణ-శంకర్పల్లి
బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభి స్తున్నాయని సీపీఐ శంకర్పల్లి మండల కార్యదర్శి సుధీర్‌కుమార్ అన్నారు.సీపీఐ జాతీయ పార్టీ పిలుపు మేరకు గురువారం శంకర్పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఇంటింటా ప్రచార వాల్‌పోస్టర్‌ను పార్టీ కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాటా ్లడుతూ సీపీఐ ఆధ్వర్యంలో తాము ప్రజలకు వద్దకు వెళ్లి, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వాల గురించి తెలియజేస్తామన్నారు. రోజురోజుకూ ధరలు పెంచుతూ ప్రజలపై అధిక భారం వేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రజలతో ఎన్నుకోబడి ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాన మంత్రి దేశ సంపదను ఆధాని, అంబానీలకు దోచి పెడుతున్నాడని ధ్వజమెత్తారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షల కోట్లు అప్పులు చేసి, ఆదానీ, అంబానీలకు రాయితీలు ఇస్తూ పేదలకు చేసిందేమీ లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల వద్దకు తీసుకెళ్తామని తెలిపారు.సీఎం కేసీఆర్ ఎన్నికలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. హామీలు వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలనీ ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకుల నాయకులు గంగయ్య, పి. నర్సింలు, పి.బుచ్చయ్య ,సాయిలు, ఎస్. చంద్రమౌళి, ఉన్నారు.