Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
- ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తూరు మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
- పార్టీలకు అతీతంగా హాజరైన దళిత సంఘాల నేతలు ప్రముఖులు
నవతెలంగాణ-కొత్తూరు
డాక్టర్ బీఆర్. అంబేద్కర్ అందరివాడని ఆయన ఆశయాల్లో పది శాతం ఆచరించినా అదే ఆయనకు మనమిచ్చే అసలైన ఘన నివాళి అని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కొత్తూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ పిన్నింటీ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అణగారిన కులంలో పుట్టిన అంబేద్కర్ నవ సమాజ స్థాపన కోసం అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా భారత రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ భావితరాలకు ఆదర్శమనీయడని అన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నేటి యువత నడిచి నవ సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. కుల మతాలకతీతంగా సమాజాన్ని రూపు దిద్దే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు గొప్పవన్నారు. మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విగ్రహ ఏర్పాటుకు కషి చేసిన ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డిని ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. బీఆర్ అంబేద్కర్ ఓటు అనే ఆయుధాన్ని హక్కుగా కల్పించారనీ, ఆ హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మెన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య దేవేందర్ యాదవ్, నందిగామ ఎంపీపీ ప్రియాంక శివ శంకర్ గౌడ్, కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, ఎంపీడీఓ శరత్ చంద్రబాబు, కొత్తూరు మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ శోభ లింగం నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కృష్ణయాదవ్, పెంటనోళ్ల యాదగిరి, కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్, సర్పంచులు కాట్న రాజు, బి సత్తయ్య, సంతోష్ నాయక్, అంబటి ప్రభాకర్, అజరు నాయక్, రవి నాయక్, ఎంపీటీసీలు ఎర్రవల్లి ప్రసన్న, ఇందూరి సత్యమ్మ, నాయకులు మైసగళ్ళ రమేష్, దయానంద్ గుప్తా, లింగం నాయక్, గోపాల్ నాయక్, శ్రీరాముల యాదవ్, మల్లాపూర్ ఉప సర్పంచ్ పిన్నింటి హరిత, నేనావత్ గోపాల్ నాయక్, నల్లవోలు నరేందర్ రెడ్డి, దయ్యాల పాండు, దయ్యాల మల్లేష్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పెంట నోళ్ల రవికుమార్, బీఎస్పీ నేతలు జగన్, కొత్తూరు అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.