Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్
- అంబేద్కర్ యూత్, కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
నవతెలంగాణ-కొత్తూరు
ప్రపంచం గుర్తించిన మేథావి, అంటరానితనం నుంచి గర్జించిన విస్పోటనం. మనువాదంపై ఎక్కుపెట్టిన ఆయుధం, దేశం కోసం జీవితాన్ని అర్పించిన త్యాగం, ప్రపంచం గుర్తించిన జ్ఞానం, బడుగు, బలహీన వర్గాల వెలుగు ఠీవి. దేశ భవిష్యత్తుకు దిక్సూచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం కొత్తూరు మండలంలోని వివిధ గ్రామాల్లో మున్సిపాలిటీ కేంద్రాల్లో పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ లో అంబేద్కర్ యూత్, కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి చైర్పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ హాజరై ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. డాక్టర్ బీ.ఆర్ ప్రతి ఒక్కరి మన్ననలు పొందారని అన్నారు.
మండలంలోని గూడూరులోని పంచాయతీ ఆవరణలో సర్పంచ్ బి. సత్తయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దయానంద గుప్తా, పీఎసీఎస్ వైస్ చైర్మెన్ మున్నూరు పద్మారావు, మాజీ సర్పంచ్ జనార్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ టీసీలు కృష్ణయ్య, నరసింహగౌడ్, బీజేపీ మున్సి పాలిటీ అధ్యక్షులు ఎర్రవల్లి నాగరాజు చారి, అంబేద్కర్ యూత్ సభ్యులు నరసింహగౌడ్, భాస్కర్, రాజేందర్, కొత్తూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కోస్గి యాదయ్య, గూడూరు గ్రామ కమిటీ బీఆర్ఎస్ అధ్యక్షులు గుండు సురేష్, దశరథ, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.