Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
నవతెలంగాణ-పరిగి
సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశాడ ని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. మండల పరిధి లోని లక్ష్మీదేవిపల్లిలో నిర్వహించిన పల్లెబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొని పార్టీ జెండాను ఎ గరవేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిం చా రు. సర్పంచ్ రేణుక వెంకటేష్ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని లాభసా టిగా చేయాలని లక్ష్యంతో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొ చ్చారన్నారు. రైతు బీమా, రైతుబంధు, వ్యవసాయరంగా నికి 24 గంటల కరెంటు వంటి పథకాలు తీసుకువచ్చి రైతులకు అండగా నిలిచారన్నారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడమే కాకుండా, ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తున్నామన్నారు. పాలమూరు ఎత్తి పోతల ద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం చేస్తామన్నారు. త్వరలోనే రుణమాఫీ చేపడతామన్నారు. లక్ష్మీదేవిపల్లిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమని మరిన్నీ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇస్తామని లక్ష్మీదేవిపలికి వచ్చే రో డ్డును వేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్య క్రమంలో జడ్పీటీసీ హరిప్రియ ప్రవీణ్ రెడ్డి, ఎంపీపీ అర వింద్రావు, వైస్‌ఎంపీపీ కావలి సత్యనారాయణ, రైతుబం ధు అధ్యక్షుడు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేం దర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, బీఆర్ ఎస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, సయ్యద్‌పల్లి వెంకటయ్య, సయ్యద్ పల్లి రాములు, యాదయ్య, రామచందర్, రమేష్ నాయక్, మాణిక్యం, జాక్ రవి, కిరణ్ పాల్గొన్నారు.