Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి వీఓఏల వినతి
నవతెలంగాణ-కొడంగల్
వీఓఏలకు ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేత నం అమలు చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కి దౌల్తాబాద్, కొడంగల్, బోంరాస్పేట్ మండలాలకు చెందిన వీఓఏలు వినతిపత్రం అందించారు. ఈ సంద ర్భంగా జిల్లా కార్యదర్శి గోపాల్, జిల్లా అధ్యక్షురాలు సుజా త, దౌల్తాబాద్ మండలాధ్యక్షులు గోపాల్ గౌడ్, కొడంగల్ మండలాధ్యక్షులు అంజిలప్ప, బొంరాస్‌పేట్ మండలాధ్యక్షు లు రూపులనాయక్లు మాట్లాడుతూ వీవోఏలను సెర్ప్ ఉద్యోగుల గుర్తించి ఉద్యోగ భద్రత, కనీస వేతనం రూ.26 వేలతో పాటు అర్హులైన వీఓఏలకు సీసీలుగా ప్రమోషన్ కల్పించాలన్నారు. రూ.10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. గ్రామాల్లో సంఘాలను ప్రతిష్టవంతంగా తయారు చేయటానికి వీవోఏలు ఎంతగా నో కృషి చేస్తున్నారని, అయినప్పటికీ ఎటువంటి ఉద్యోగ భద్రతగానీ, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించడంలేదన్నారు. వీఓఏ సేర్ప్ సంస్థలు ఉద్యోగులుగా గుర్తిస్తూ గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతీ వీఓఏకు నెల జీతాలు చెల్లించా లని డిమాండ్ చేశారు. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటు తున్న రూ.3900 వేలతో ఎలా బతకాలో ఆలోచించాల న్నారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె విరమించేది లేదన్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ వీఓఎల డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వీఓఏలు నవజ్యోతి, చరి త, గుర్నాథ్, అమృతమ్మ,ఆంజనేయులు తదితరులున్నారు.