Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మియాపూర్ శంకర నేత్రాలయలో పరికరాన్ని ఆవిష్కరించిన వైద్యులు
నవతెలంగాణ-మియాపూర్
కంటి శుక్ల శస్త్ర చికిత్సకు ఉపయోగపడే అత్యాధునిక వైద్య పరికరాన్ని మియాపూర్ శంకర నేత్రాలయలో శుక్రవారం ప్రారంభించారు. ఈ పరికరం పేరు అల్కాన్ ఆర్గోస్ ఇది సౌత్ ఇండియా, సెంట్రల్ ఇండియాలోనే మొట్టమొదటి సారిగా అందుబాటులోకి వచ్చిన పరికరం. ప్రధానంగా ఆల్గోస్ టెక్నాలజి కాటరాక్ట్ ( శుక్లము) శస్త్ర చికిత్సలో ఉపయోగపడుతుంది. ఈ కొత్త టెక్నాలజీతో స్కానింగ్ చాలా సమర్ధవంతంగా అత్యధిక ఖచ్ఛితత్వంతో పనిచేస్తుందని అల్గొస్ ప్రతినిధులు వివరించారు. మొత్తం ముదిరి పోయి దృఢమైన, దట్టమైన శుక్లం ఉన్న రోగులకు కన్నుని టచ్ చేయకుండానే స్కాన్ చేయగలదనీ తెలిపా రు. చిన్న పిల్లల కంటి శుక్లంలలో కూడా ఖచ్చితత్వంతో సమర్ధవంతంగా స్కాన్ చేసే సౌలభ్యం ఉన్నట్లు వివరిం చారు. ఇటీవల కాలంలో ఇలాంటి శుక్లాల సమస్యలు పెరిగాయని అత్యాధునిక వైద్యాన్ని సరసమైన ధరలకే అందిస్తామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీనివాస్ తాటిపల్లి, సుష్మా రాజ, నవీన్ నూకల, రమ, తదితరులు పాల్గొన్నారు.