Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులకు ట్రైన్ పాసులు ఇప్పిస్తాం
- మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్,మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
నవతెలంగాణ-మర్పల్లి
మండల కేంద్రంలో మంగళవారం నుండి ఇంటర్సిటీ ట్రైన్ రైల్వే అధికారులు నిలపడంతో హర్షం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్, చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మండల అధ్యక్షు డు మల్లేష్ యాదవ్, మండల ఇన్చార్జి శ్రీనివాస్ గౌడ్, రామేశ్వర్ రెడ్డిలు వికారాబాద్ వరకు టికెట్లు తీసుకొని రైలు ప్రయాణం చేశారు. బీజేపీమంత్రులు నాయకుల కషివల్లే అధికారులు నేడు మర్పల్లిలో ఇంటర్సిటీ ట్రైన్ నిలపడం జరుగుతుందని వారన్నారు. మర్పల్లి మండల ప్రజానీకం కోరిక మేరకు రైల్వే మంత్రికి, రైల్వే అధికారులకు వినతి పత్రాలు సమర్పించడంతో ఇవాళ రైలు నిలుపుతున్నరని గతంలో అనేక సార్లు వినతిపత్రలు సమర్పించిన విషయం గుర్తుచేసారు. వికారాబాద్ హైదరాబాద్లో చదువుకుంటు న్న విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా రైల్వే పాసులు ఇప్పి స్తామని మాజీ మంత్రి ఎంపీ హామీ ఇచ్చారు. ఎంఎం టీఎస్ ట్రేన్స్ కూడా వికారాబాద్ వరకు పోడగించడాని కేం ద్రం సుముఖంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తాన వాట చెల్లించా ని కారణంగానే ట్రైన్స్ వికారాబాద్ వరకు రాలేకపో తున్నయని అన్నారు. వికారాబాద్, హైదారా బాద్లో చదువుతన్న విద్యార్థులకు ఉచితంగా పాస్లు పంపిణీ చేస్తానని మాజీ విశ్వేశర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్, హామీ ఇచ్చారు. మం డలంలో నుంచి అధిక పాసులు పొంది ట్రైన్ నిలుపుదలకు మండల బీజేపీ నాయకులు సహకరించారు. కార్యక్రమం లో మహేష్, శ్రీమంత్ కుమార్, క్రీష్నరెడ్డి, జైపాల్, శ్రీనివాస్, రఘుపతి, లక్ష్మన్న, సంజీవులు, మనోహర్, శ్రీధర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, మధు కర్, యాదగిరి, ప్రవీణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.