Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7-8,వార్డులలో నీటి సమస్య తీర్చాలి
- కమ్యూనిటీ సోపిట్స్ ఏర్పాటు చేయాలి
- వికారాబాద్ డీఎల్పీఓ అనిత
నవతెలంగాణ-ధారూర్
గ్రామంలో మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఇబ్బందు లు కలగకుండా నీటి సరఫరా చేసే నల్లాలకు ప్లో కంట్రోల్ వాల్స్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని 7-8, వార్డుల్లో వా రం రోజులలో నీటి సమస్యను తీర్చాలని వికారాబాద్ డీ ఎల్పీఓ అనిత సూచించారు. ధారూర్ మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంలో మంగళవారం పర్యటించారు. గ్రామంలో పర్యటించి నీటి సమస్యలు ఏఏ వార్డులలో ఉ న్నాయో ఎంత సమయంలో నల్లాల నుండి ఎన్ని నీళ్లు వ స్తున్నాయి అని తెలుసుకున్నారు, గ్రామ సర్పంచ్ చంద్రకళ మల్లికార్జున్ గ్రామంలో 150 ఇండ్లకు సరఫరా చేసే నల్లా లు సీసీ రోడ్ల క్రింద ఉన్నాయని మిషన్ భగీరథ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ప్రణాళిక లేకుండా మిషన్ భగీరథ పైపులను వేయడం వల్ల సరపరలో రెండు వార్డులకు అంతరాయం ఏర్పడుతుందని డీఎల్పీఓ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామం లో మిషన్ భగీరథ నీళ్లను ప్రజలందరికీ అందేలా ప్రజా ప్ర తినిధులు అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించా రు. గ్రామంలో మురుగు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం గా ఉంచాలని అవసరం ఉన్నచోట మహాత్మా గాంధీ జాతీ య ఉపాధి హామీ పథకంలో కమ్యూనిటీ సోఫిట్స్ ఏర్పాటు చేయాలని గ్రామంలో నేటి సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు, వేసవికాలం ఉన్నందువల్ల ప్ర జలు నీటి సమస్యతో ఇబ్బందులు పడకుండా చూసుకో వాలని గ్రామంలో నల్లాలకు వెంటనే చేర్రలు ఏర్పాటు చేసి అందరికీ సమానంగా నీళ్లు అందేలా చూడాలని అవసరం వస్తే పోలీసుల సహాయం తీసుకోవాలని డిఎల్పిఓ తెలిపా రు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి షఫీ ఉ ల్లాఖాన్, మండల ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రవి, గ్రామ పం చాయతీ కార్యదర్శి వినోద్ కుమార్, గ్రామపంచాయతీ సి బ్బంది పాల్గొన్నారు.