Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్
నవతెలంగాణ-చందానగర్
ప్రతి ఒకరూ మూగజీవుల సంరక్ష ణకు కృషి చేస్తూనే స్వేచ్ఛగా జీవించేలా చూడాలని ప్రముఖ యాంకర్ రష్మీ గౌత మ్ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధి లో మంజీర పైప్‌లైన్ రోడ్డులో డాగీ విల్లే పేరుతో ఏర్పాటు చేసిన బోర్డింగ్ డే కేర్ సెంటర్ ప్రారంబోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ విచ్చేసి రామచంద్రాపురం ఇన్స్పెక్టర్ నరేం దర్‌రెడ్డి, నార్కోటిక్స్ ఎస్పీ సునీతారెడ్డి, వెటర్నరి యన్, డాక్టర్ ఉమాకాంత్ పాటు వ్యవస్థాపకురాలు అమృ తాతో కలిసి సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ. శునకాలకు మనం పంచే ప్రేమతో 100 శాతం తిరిగి విశ్వాసం చూపుతాయన్నారు. పెంపుడు జంతువుల యాజమానులు డే కేర్ సెంటర్లో కా కుండా వీలయినంత వరకూ తమ వద్దే పెంచుకునేందుకు ప్రయత్నించాలన్నారు. ప్రతి ఒకరూ మూగజీవుల సంర క్షణకు కృషి చేసి స్వేచ్ఛగా జీవించేలా చూడాలన్నారు. పెం పుడు జంతువుల పట్ల బాధ్యతగా ఉండాలని, వీలయినంత వరకు బోనులో వేయకుండా వాటికి నచ్చేలా ఉండేలా చేసినప్పుడే అవి సంతోషంగా ఉంటాయన్నారు. పెంపుడు శునకాలు డే కేర్ సెంటర్లో వదిలి వెళ్ళేటప్పుడు అవి దిగులు తో మానసికంగా కృంగిపోయే అవకాశం ఉంటుందని, డే కేర్ సెంటర్లో తోటి శూనకాలతో కలిసి ఉన్నప్పుడు తిరిగి తీసుకెళ్తే మళ్ళీ అదే బాధకులోనవడం జరుగుతుందని, అం దువల్ల పెంపుడు జంతువుల యాజమానులు వీలయినం త వరకు తమ వద్దే స్వేచ్ఛగా పెంచుకోవడంపై దృష్టి పె ట్టాలన్నారు. బోనులో 8 గంటలు, ఆపై ఉంచాలంటే ఎం తో బాధను భరిస్తాయో అర్థం చేసుకోవచ్చని, చిన్న పిల్లల ను ఏ విధంగా చూసుకుంటామో పెంపుడు జంతువులను అదేవిధంగా చూసుకోవాలన్నారు.