Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్పీఐ పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ పోరాటాల రామన్న
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
పరిగిలో సామాజిక ఉద్యమాలను అడుగు అడుగున అణచి వెసిన అగ్రవర్ణాల ఆధిపత్యం 2024లో పరిగి గడ్డపైన సామాజిక వర్గాల జెండాను ఎగురవేస్తామని ఆర్పీఐ పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ తెలంగాణ ఉద్య మకారుడు పోరాటల రామన్న దోమ మండలంలో మంగళవారం ఒక ప్రకటనలో దీమా వ్యక్తం చేశారు. పరిగి గడ్డపైన జరిగిన ఉద్యమం వాస్తవాలను నేటి యువకులు తెలుసుకోవలన్నారు. మలీ దశ తెలంగాణ ఉద్యమంలో 1991 నుండి చాపకింది నీరులా ప్రజా సంఘాల ఆధ్వ ర్యంలో రగిలిన తెలంగాణ ఉద్యమం 1997లో పరిగిలో ప్రజా యుద్ధనౌక గద్దర్‌తో బహిరంగ సభ జరిగింది. 19 99లో బీసీ అభ్యర్థి కే.లక్ష్మయ్య ముదిరాజ్‌ను ఎమ్మెల్యేగా పోటీకీ నిలబడిన అయన ఓటమి పొందిన మరుసటి రోజే టీడీపీలోకి వెళ్ళరనీ తెలిపారు. 2001లో టీఆర్ఎస్లో పుట్టిన పూన్నాదిలోనె జెండా బుగ్గన్న వర్గం పట్టరాని, 20 01లో బీఆర్ఎస్ నుండి ముజాహిద్పూర్ ఎంపీటీసీగా గెలిచారన్నారు. 2004లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోత్తులో హరివర్ధన్ రేడ్డి పోటీలో ఉండగా కమతం రామ్‌రెడ్డి ఇం డిపెండెంట్‌గా పోటీ చేెయడం వలన గెలిచే సీటు ఓటమి పొందరాని, 2009లో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పోటీ చేస్తానని చెప్పి చేయక పోవడం వలన అప్పుడు గెలిచే సీటు సామాజిక వర్గాలం ఓటమి పొందరాని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పరిగిలో బలహీన వర్గాల నాయ కులు ఐక్యమత్యం అవుతున్న సమయంలో పరిగి పాలకు లు చెసిన కుట్రలతో 2014 దొరల పాలైందనీ, అప్పుడు గట్టి ధైర్యం సంకల్పించిందనీ రామన్న తెలిపారు. పరిగి పాలకులకు ఒక్క ఎజెండా లేదనీ, ఏ పార్టీ బాలాంగా ఉం టే అ ఏజెండాలోకి మారుతారన్నారు. పరిగి పాలకులు ఈసారి సామాజిక వర్గాల ప్రజలం ఐక్యమై దొరల రాజ్యా న్ని పడకొడాదమని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.