Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేవెళ్ల
చేవెళ్ల మండలంలో మంగళవారం సాయంత్రం భారీగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. చేవెళ్ల మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామ సమీపంలో హైద్రాబాద్- బీజాపూర్ జాతీయ రహదారి పక్కన భారీ మర్రి చెట్టుతోపాటు ఇతర చెట్టు కొమ్మలు రోడ్డుపై అడ్డంగా పడిపోయిం ది. దీంతో హైదరాబాద్‌తోపాటు వికారాబాద్ జిల్లాలకు వెళ్లే వాహనాలు ఇరుపక్కల భారీగా కిలోమీటర్ మేర నిల్చిపోయాయి. దీంతో వాహనదారు లు వర్షానికి ఇబ్బం దులు పడ్డారు. అయితే వర్షం చేవెళ్ల మండలం లోని మ ల్కాపూర్, కందవాడ, మీర్జాగూడ, బస్తేపూర్, ఖానాపూర్, అలూర్, అంతారం, కౌకుంట్ల, తంగడపల్లి, మడికట్టు తదితర గ్రామాల మీదుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కాకపోతే భారీగా ఈదురుగాలులు రావడంతో విద్యుత్ అంతారాయం ఏర్పడింది. చెట్లు రోడ్డుపై పడిపోవడంతో చేవెళ్ల పోలీ సులు సంఘటన స్థలంకు చేరుకుని జేసీబీ సహాయంతో చెట్టును రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి ట్రాఫిక్ తొలగించారు. ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.