Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోరుగా అక్రమ మట్టి దాందా
- అనుమతులు లేకుండా ఇష్టారాజ్యాంగా మట్టిని తరలిస్తున్న అక్రమార్కులు
నవతెలంగాణ-దోమ
అక్రమ మట్టిదందా కొనసాగించాలంటే అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ మండలం లో ఎక్కడ కూడా అనుమతులు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండతో రాత్రి, పగలు మట్టి దందా జోరుగా కొనసాగిస్తున్నారు. లక్షల రూపాయాల ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కులు గండి కొడుతున్నారు. దోమ మండల పరిధిలోని ఖమ్మంనాచారం గ్రామంలోని సర్వే నంబర్ 77లో ప్రభుత్వం భూమి ఉంది. అట్టి భూమిలో కొందరు వ్యక్తులు ఆరు రోజులుగా జేసీబీలతో ట్రాక్టర్లలో మట్టిని నింపుతూ యథేచ్ఛగా ఓ రైస్‌మిల్‌కు తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ విషయం సంబంధిత అధికారులకు తెలిసిన మాముళ్లు అందడంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు ఊటుపల్లి, రాకొండ గ్రామాలలో ప్రభుత్వ భూమిలో రెండు నెలల నుంచి ఓ వ్యాపారుడు తన టిప్పర్లతో రాత్రి వెళల్లో యథేచ్ఛగా మట్టిని తరలి స్తున్నాడు. ఈ విషయం స్థానిక తహసీల్దార్‌కు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నా యి. ఇదిలా ఉండా గ్రామాలలో గృహ నిర్మాణాలకు, రోడ్డు పనులకు మొరం అవసరం ఉన్నప్పటికి అనుమతులు లేకుండానే వీఆర్ఎల కనుసైగల్లో ప్రభుత్వ, ప్రయివేట్ భూములతో పాటు శిఖం భూములు, చెరువులలో నుంచి మట్టిని తరలిస్తున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని అక్రమ మట్టి దందాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతు న్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌ను వివరణ కోరగా మట్టి తరలిస్తున్న విషయం తమ దృష్టికి రాలేదని, ఒక వేళా తరలిస్తున్నట్లు తెలిస్తే వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ, ప్రయివేట్ భూములలో మట్టిని తరలించాలంటే తప్పనిసరిగా మైనింగ్ ఏడీ అనుమతులు తీసుకోవాలి. అనుమతులు లేకుండా మట్టి దందాను కొన సాగిస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు.