Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెరుచుకున్న మ్యాన్ హౌల్స్
- తాగునీటిలో డ్రయినేజీ నీరు
- వర్షంతో రాకపోకలకు ఇబ్బంది
- పట్టించుకొని మున్సిపల్ అధికారులు
- ఇబ్బందుల్లో నార్సింగి దళిత బస్తీవాసులు
వనతెలంగాణ-గండిపేట్
నార్సింగి మున్సిపాలిటీ ఆర్భాటం ఎక్కువ అమలు తక్కువ అన్న చందంగా ఉంది. హమీలకు హద్దు, అదుపు లేదు కానీ ఆచరణ మాత్రం శూన్యం. సీసీరోడ్లు, డ్రయినేజీ వ్యవస్థ కోసం ఇష్టానుసారంగా తవ్వారు. దీంతో స్థానికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, స్థానిక కౌన్సిలర్లు, కాంట్రాక్టర్ల కుమ్మక్కుతో సమస్యలు రెట్టింపు అవుతున్నాయి.
నార్సింగి మున్సిపలిటీ 6వ వార్డులో డ్రయినేజీ, తాగునీటి పైపులు, సీసీరోడ్ల కోసం తవ్వి వదిలేశారు. బా బు జగ్జీవన్‌రావ్ కమ్యూనిటీ హాల్ నుంచి గిరిగిరిగడ్డ వరకు తవ్వారు. దీనిపై అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. స్థానిక కౌన్సిలర్ పరి శీలనకే పరమితమైయ్యారని మండిపడుతున్నారు. పనులు త్వరితగతిన చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తాగునీటి పైపులలలో డ్రయినేజీ నీరు క లిసి కలుషితం అవుతోంది. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వర్షం వస్తే మ్యాన్ హౌల్స్ వరద నీటితో నిండిపోతుంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.